సీతారామం – పరిచయం అక్కర్లేని సినిమా, “నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే…” అనే డైలాగ్ ఇప్పుడు అందరి నోటా వినిపిస్తూ ట్రెండ్ అవుతుంది.
ఇప్పుడు ఆ సీత గురించి నాలుగు మాటలు పోగేస్తే ఎలా ఉంటుంది?
ప్రేమ, దాన్ని వ్యక్తం చేసే మాటలే కాకుండా చూస్తున్నంత సేపూ కనులను కట్టిపడేసే ఇంకో మ్యాజిక్కు కూడా ఉంది, అదేనండోయ్ మన హీరోయిన్ కట్టిన చీరలు.
చీర ఆడవారికి ఒక ఎమోషన్. సినిమాలో సీతను చూస్తుంటే ఎంత చక్కగా అందంగా చూడ ముచ్చట గా ఉంది. ఎంత అదృష్టం ఎన్ని రకాల చీరలు కట్టింది అనిపిస్తుంది.
తన హీరోని కలిసే తొలిచూపులో కట్టిన చీర తెలుపు తన మనసులాగే స్వచ్చతని, అమాయకత్వాన్ని తెలిపేలా ఉంటుంది.
రాముడికై సీతనే వెతుకుతూ వచ్చినపుడు ఆ ‘నీలం రంగు చీరలో’ తన మనసులో సముద్రమంత ప్రేమను దాచి ఉంచినట్టు అనిపిస్తుంది. నాట్యం చేస్తున్నపుడు ధరించిన ఎరుపు రంగు చెప్పకుండా ఎంట్రీ ఇచ్చిన హీరో మీద కోపాన్నే కాదు అంతులేని ప్రేమను కూడా సూచిస్తూంది.
ఒక్కోరంగు కి ఒక్కోప్రతీక, ప్రత్యేకత, నేత చీర కట్టినా పట్టు చీర కట్టినా దేని ప్రత్యేకత దానిదే, దేని అందం దానిదే. భాషకి, ప్రాంతానికి సంబంధం లేకుండా ఏ వ్యక్తి ఏ రకంగా చీర కట్టినా చూడటానికి కన్నుల పండుగే. త్రేతాయుగం లో సీతను చూడలేదు కానీ, కలియుగాన ఈ సీత తన కాస్ట్యూంస్ తో పాటు తన ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.
సీత లా మనందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన సీతారామం లో మృణాల్ ఠాకూర్ ఫోటోస్ కొన్ని మీ కోసం.
మీరూ ట్రై చేయండి.
Below are a collection of Sarees along with available buying options from Amazon.

Click here to visit Amazon & buy (#ad)

Click here to visit Amazon & buy (#ad)

Click here to visit Amazon & buy (#ad)

Click here to visit Amazon & buy (#ad)

Click here to visit Amazon & buy (#ad)

Click here to visit Amazon & buy (#ad)

Click here to visit Amazon & buy (#ad)







4 thoughts on “A tribute to Sita of “Sita Ramam” – In Telugu”