చీర :
ఆరు గజాలు ఉండే అందమైన వస్త్రం..
ఆడవారు ఆనందంగా తొడిగే అలంకరణం..
చీర :
వన్నెలు కప్పుతూ
సొగసును దాచి పెడుతూ
కనీ కనిపించని అందాలతో
ఇతరులను ఆకర్షిస్తు
ఇట్టే ఆకట్టుకునే
మా ఆడువారు ఒంటి మీద ఆభరణం..
జాతి మత కుల బేధం ఇవేమీ అడ్డు చెప్పనిది .
ఒక్కో సందర్భానికి ఒక్కో రకం అలా పలు రకాలు.
నిలువెత్తు అందం చూడాలి అన్నా చీరలోనే
అంతటి అందం చూపించాలన్నా చీరకే సాధ్యం
చాందిని_మెడా
17-06-2022